సినీనటి అన్నపూర్ణ కుమార్తె ఆత్మహత్య!

వాస్తవం ప్రతినిధి: టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కూతురు కీర్తి ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అన్నపూర్ణకి పిల్లలు లేకపోవడంతో కీర్తిని దత్తత తీసుకొన్నారు. మూడేళ్ల కిందట పెళ్లి చేశారు. కీర్తి భర్త వెంకటకృష్ణ కర్ణాటకలోని రాయచూర్‌లో ఎఫ్‌సీఐలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. వెంకటకృష్ణ సాయితో కీర్తికి మూడేళ్ల క్రితం వివాహమైంది.ఈ జంటకు ఏడాది వయసున్న కొడుకున్నాడు. ప్రస్తుతం శ్రీనగర్‌ కాలనీలోని కృష్ణా బ్లాక్‌లో కీర్తి నివాసం ఉంటున్నారు.భర్తతో విభేదాల కారణంగా శ్రీనగర్ కాలనీలోని కృష్టా అపార్ట్‌మెంట్‌ లో కీర్తి ఉంటోంది. శనివారం తెల్లవారుజామున బెడ్‌రూమ్ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి డోర్ పగుల గొట్టి లోనికి వెళ్లిచూసేసరికి కీర్తి ఉరి వేసుకుందని తెలిపారు అన్నపూర్ణ. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించిన పోలీసులు, కీర్తి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.