వంశీ పైడిపల్లి బర్త్‌డే పార్టీలో టాలీవుడ్ టాప్ హీరోస్ త్ర‌యం

వాస్తవం సినిమా: టాలీవుడ్ టాప్ హీరోస్ త్ర‌యం మ‌హేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా క‌లిసి క‌నిపిస్తున్నారు. పార్టీస్‌లోనో లేదంటే ఏదైన అకేష‌న్‌లోనో ఈ ముగ్గురు హీరోల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఫ్యామిలీస్‌తో క‌లిసి మ‌రీ పార్టీల‌కి హాజ‌ర‌వుతున్న వీరు క‌లిసి ఫోటోల‌కి ఫోజులిస్తున్నారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండడంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోతున్నాయి. భ‌ర‌త్ అనే నేను మూవీ ఆడియో వేడుక త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల‌లో ఈ ముగ్గురూ కలిసి సందడి చేసి అభిమానులను ఫుల్ ఖుసీ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ముగ్గురు హీరోలు శుక్రవారం వంశీ పైడిప‌ల్లి పుట్టిన రోజు పార్టీ లో సందడి చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు, దేవిశ్రీ ప్రసాద్‌, నమ్రత, హరీష్‌ శంకర్‌ తదితరులు సోషల్‌మీడియా వేదికగా వంసి కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పార్టీ నిర్వహించారు. దీనికి మహేశ్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, దిల్‌రాజు, పూజా హెగ్డే తదితరులు హాజరయ్యారు. వంశీ పైడిపల్లితో కేక్‌ కట్‌ చేయించి, శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ముగ్గురు హీరోల‌తో క‌లిసి వంశీ పైడిప‌ల్లి మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాన్ని చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం వంశీ- మ‌హేష్ కాంబినేష‌న్‌లో మూవీ రూపొందుతుండ‌గా త్వ‌ర‌లో చెర్రీ- జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌నున్నారు. ఈ సినిమా 250 కోట్ల బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ అర‌వింద స‌మేత చిత్రంతో బిజీగా ఉండ‌గా చెర్రీ .. బోయ‌పాటి సినిమా చేస్తున్నారు. మ‌రి టాప్ స్టార్స్ త్ర‌యంతో సినిమా ఎప్పుడు తెర‌కెక్కుతుందో చూడాలి