యూనిఫాం లోనే సి ఎం ముందు మోకరిల్లిన సీనియర్ పోలీస్ అధికారి!

వాస్తవం ప్రతినిధి: ఒక సీనియర్ పోలీస్ అధికారి యూనిఫాం లో ఉండి సి ఎం ముందు మోకరిల్లి నిలుచున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక సీనియర్‌ పోలీస్‌ అధికారి ప్రవీణ్ కుమార్ సింగ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ముందు యూనిఫాంలో మోకరిల్లిన వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఒక ఫోటో లో సి ఎం ముందు మోకరిల్లి కనపడగా, మరో ఫొటోలో ఆయన ఆదిత్యనాథ్‌కు తిలకం దిద్దుతూ కనిపించారు. అలానే ఇంకొక ఫొటోలో ఆయనకు దండవేస్తున్నట్లున్నాయి. అయితే ఈ ఫొటోలను ఆ అధికారే ‘ఫీలింగ్‌ బ్లెస్స్‌డ్‌’ అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం గమనార్హం. దీనితో ఇవి నేట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి. శుక్రవారం గురు పూర్ణిమ సందర్భంగా గోరఖ్‌నాథ్‌ టెంపుల్‌లో ఆదిత్యనాథ్‌ ఆశీస్సులు తీసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. గోరఖ్‌నాథ్‌ ప్రాంతానికి ప్రవీణ్‌కుమార్‌ సింగ్‌ సర్కిల్‌ ఆఫీసర్‌కావడంతో పాటు ఆయన పరిధిలో అనేక పోలీస్‌ స్టేషన్లున్నాయి కూడా. అయితే అలాంటి ఒక అధికారి ఈ విధంగా ప్రవర్తించడం పై అనేక విమర్శలు రావడంతో ఆదిత్యనాథ్‌ను సిఎం హోదాలో ఉన్నందుకు తాను గౌరవించలేదని, ఆలయం నిర్వాహకుడుగా ఉండటంతో పూజచేశానని బదులిచ్చారు.