మెగా ఫోన్ పట్టనున్న రేణు

వాస్తవం సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పెళ్లికి ముందు కథానాయికగా నటించిన రేణు దేశాయ్ ఆ తరువాత నటిగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. పవన్ నుంచి విడిపోయిన ఆమె మరాఠీ చిత్రపరిశ్రమపై దృష్టి పెట్టి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో తెలుగులో నటిగా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆమె స్పందిస్తూ .. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. తాను తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది నటిగా కాదనీ .. దర్శకురాలిగానని అన్నారు. తెలుగులో నేరుగా ఒక సినిమాకి దర్శకత్వం వహించనున్నానని చెప్పారు. ఆల్రెడీ కథ – స్క్రీన్ ప్లే సిద్ధమైపోయాయనీ, ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నానని అన్నారు. సంక్రాంతి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. ఈ సినిమాలోనూ తాను కనిపించననీ .. కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు.