మరొక బృహత్తర పధకానికి శ్రీకారం చుట్టనున్న తెలంగాణా సర్కార్

వాస్తవం ప్రతినిధి: మరొక బృహత్తర పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇప్పటివరకు పాఠశాల విద్యార్థులకు పరిమితమైన మధ్యాహ్న భోజన పథకం ను ఇప్పుడు కాలేజీ విద్యార్దులకు కూడా వర్తింపజేయడానికి తెలంగాణా సర్కార్ సిద్దమౌతుంది. ఇప్పటివరకు పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని అందించి దేశం మొత్తంలో తెలంగాణ శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణా సి ఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్, మోడల్ జూనియర్ కాలేజీలు, బీఈడీ, డీఈడీ కాలేజీల్లోని దాదాపు 5 లక్షల మందికి అందించేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మంత్రులతో సమావేశమై చర్చించారు. ఈ క్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలోని కడియం శ్రీహరి చాంబర్ లో సమావేశమై చర్చించినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.