ఫాన్స్ కి బన్నీ రిక్వెస్ట్

వాస్తవం సినిమా: అల్లు అర్జున్ త‌న కెరీర్‌లో ఫ‌స్ట్ టైం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు.నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను ఒప్పుకోలేదు బ‌న్నీ.ఆయ‌న సినిమా కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. కాని బ‌న్నీ మాత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఇచ్చిన ప్లాప్‌తో డైలామాలో ప‌డ్డాడు.విక్ర‌మ్ కుమార్‌తో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి ఆ సినిమాపై క్లారీటి లేదు.దీంతో బన్నీ కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడనే దానిపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన చర్చ నడుస్తోంది.

కాగా, ఈ వార్తలపై బన్నీ ట్విటర్‌లో స్పందించారు.మీ అందరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను.. నా తదుపరి చిత్రం గురించి ప్రకటించే వరకు దయచేసి ఓపికగా ఉండండి. ఎందుకంటే ఇది ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. నేను మంచి సినిమా చేయాలని చూస్తున్నాను. దీనికి టైం పడుతోంది. అర్థం చేసుకోండి ….ధన్యవాదాలు’ అంటూ బన్నీ ట్వీట్‌ చేశారు.మ‌రి బ‌న్నీ కొత్త సినిమా ఎప్పుడు మొద‌లు పెడ‌తాడో చూడాలి.