పవన్ పై విమర్శలు చేసిన అంబటి

వాస్తవం ప్రతినిధి: క‌ర్నూ‌లు జిల్లా‌లో వైసీపీ నేత అంబటి రాంబాబు పర్యటించారు. ఈ నేపధ్యంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.  మంచి వ్యక్తిని అటూ తనను తాను సొంతంగా పవన్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు అని అంబటి అన్నారు. పవన్ కు అసెంబ్లీ ని ఊపెయాలని ఉంటే 2014 లో ఎందుకు పోటీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. అలానే అప్పుడు ఎందుకు టీడీపీ కి చంద్రబాబుకు మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు. ఒకవేళ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదని పవన్ టీడీపీ నుంచి బయటకు వచ్చారా అని అంబటి ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ,బీజేపీ పార్టీ లు ప్రజలకు అన్యాయం చేశారని, వారి కోసం పోరాడుతున్నానని పవన్ పలు సార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పవన్ పై ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా అంబటి రాంబాబు కూడా పవన్ పై విమర్శలు చేశారు.