పవన్‌పై జగన్ వ్యాఖ్యలు.. నాగబాబు రియాక్షన్!

వాస్తవం ప్రతినిధి: పవన్ కల్యాణ్‌పై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కొత్త కారు మార్చేసినట్టు పవన్‌ కల్యాణ్ నాలుగైదేళ్లకు ఓసారి భార్యను మార్చేస్తారంటూ వైసీపీ అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విమ‌ర్శ‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. జగన్ వ్యాఖ్యలపై నటుడు నాగబాబు ఘాటుగా స్పందించారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు.. పవన్‌ను ఎదుర్కొనే సత్తాలేకే జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ఓ పార్టీ అధినేతగా నోరు జారడం ఆయనకు తగదని హితవు పలికారు. మిగతావారు విమర్శించడం వేరు, ఓ పార్టీ అధినేతగా జగన్ మాట్లాడడం వేరని వ్యాఖ్యానించారు. ఎవరినో పెళ్లి చేసుకుంటానని వదిలేయడం పవన్ చేయలేదన్నారు. ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి ఓ పాయంట్ కావాల‌ని అదిలేక‌నే వైవాహిక సంబంధం గురించి మాట్లాడుతున్నారన్నారు.రాష్ట్రంలో ప‌వ‌న్ బ‌లంగా త‌యార‌వుతున్నార‌ని, ఇది చూసి జగ‌న్ అభ‌ద్ర‌తా భావానికి లోన‌య్యార‌ని అందుకే పవన్ పై విమర్శల దాడి చేస్తున్నారని అన్నారు. టీడీపీ లేదా వైసీపీ పవన్‌ను చాలా తక్కువగా అంచనా వేసి ఉండవచ్చునని, పవన్ వల్ల తమకు లబ్ధి చేకూరుతుందని ఇరు పార్టీలు భావించి ఉంటార‌ని అన్నారు. అది త‌ట్టుకోలేక బ‌ల‌హీన‌ర‌పిచేందుకే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు.