నేడు చెన్నైకి ఉపరాష్ట్రపతి వెంకయ్య

వాస్తవం ప్రతినిధి:భారత ఉపరాష్ట్రపతి నేడు చెన్నై వెళ్లనున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధిని పరామర్శించనున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న వెంకయ్య ఈరోజు చెన్నై వెళ్లి స్వయంగా పరామర్శించనున్నారు.
మరోవైపు కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన అభిమానులు, డీఎంకే కార్యకర్తలు ఆందోలనకుగురవుతున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి గోపాలపురంలోని ఆయన నివాసానికి పెద్దయెత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పలువురు రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే సహా ఇతర పార్టీల నేతలు కరుణానిధి ఇంటికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.