ఢిల్లీ లో కాల్పుల కలకలం

వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ నగరంలోని రన్హోలా ప్రాంతంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వచ్చిన కొందరు దుండగులు ఒక బిల్డర్ పై కాల్పులకు పాల్పడ్డారు. దీనితో ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బిల్డర్ ని స్థానికులు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న బిల్డర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.