ట్రంప్ టవర్ వద్ద అనుమానాస్పద ప్యాకేజీలు!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన మాన్‌హట్టన్‌లోని ట్రంప్ టవర్‌వద్ద  మరోసారి కలకలం చోటుచేసుకుంది. ట్రంప్ టవర్ వద్ద శుక్రవారం పలు అనుమానా స్పద ప్యాకేజీలు కనిపించడం తో కలకలం రేగింది. దీనితో న్యూయార్క్ పోలీస్ విభాగానికి చెమటలు పట్టాయి. అయితే ప్రాధమిక పరిశీలన తరువాత ఆ ప్యాకేజీ ల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తేలడం తో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్యాకేజీ లపై విచారణ మాత్రం జరుపుతున్నట్లు పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ట్రంప్‌ సొంతమైన 58 అంతస్థుల భవనం వద్ద  మొదట రెండు అనుమానాస్పద ప్యాకెట్లను భద్రతా సిబ్బంది గమనించారు. అనంతరం జరిపినవిస్తృత పరిశోధన మరో  రెండు ప్యాకెట్లు లభించడంతో  అక్కడి అధికారుల్లో ఆందోళన మొదలైంది.  హుటాహుటిన బాంబ్‌ స్క్వాడ్‌ని పిలిపించి తనిఖీలు చేపట్టారు.  భవనంలోని  మూడు  వేర్వేరు ప్రాంతాల్లో  అనుమానాస్పద వస్తువులను గమనించామని పోలీసు అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని  ఎన్‌వైపీడీ ప్రజాసమాచార అధికారి సెర్జెంట్‌  విన్సెంట్‌ మార్చీజ్‌  తెలిపారు.