టీ-20 లలో వేగవంతమైన శతకం సాదించిన న్యూజిలాండ్ ఆటగాడు గఫ్తిల్

వాస్తవం ప్రతినిధి: న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న టీ20 బ్లాస్ట్‌లో  గఫ్తిల్ 35 బంతుల్లో శతకం సాధించి… టీ20ల్లో వేగవంతమైన శతకం సాధించిన ఆటగాళ్ల సరసన నిలిచాడు. శుక్రవారం నార్త్ంప్టన్‌షైర్‌-వర్సస్టర్‌షైర్‌ మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్త్ంప్టన్‌షైర్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా అనంతరం188 పరుగుల లక్ష్యం కోసం చేధనకు దిగిన వర్సస్టర్‌షైర్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ నేపధ్యంలో 35 బంతుల్లోనే శతకం సాధించాడు. 162 పరుగుల వద్ద రిచర్డ్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న గప్తిల్‌ కాబ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి గప్తిల్‌ వ్యక్తిగత స్కోరు 102(38 బంతుల్లో) పరుగులు. ఇందులో ఏడు సిక్స్‌లు, 12 ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్‌ జాయ్‌ క్లార్క్‌ కూడా 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆ జట్టు 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

టీ20 చరిత్రలో వేగవంతమైన శతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో గప్తిల్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో) ముందు ఉండగా… రిషబ్‌పంత్‌(32), ఆండ్రూ సైమండ్స్‌(34), ఎల్‌పీ వాన్‌డర్‌(35), డేవిడ్‌ మిల్లర్‌(35), రోహిత్‌ శర్మ(35), మార్టిన్‌ గప్తిల్‌(35) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.