టర్కీ ని హెచ్చరించిన ట్రంప్!

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికా టర్కీ ని హెచ్చరించినట్లు తెలుస్తుంది. తీవ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై అమెరికన్‌ పాస్టర్‌ను నిర్బంధించినందుకు ప్రతిగా టర్కీపై ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరించినట్లు సమాచారం. అయితే నాటోలో కీలక మిత్రపక్షమైన టర్కీ కూడా దీనిపై ఘాటుగానే స్పందించి,ట్రంప్‌ బెదిరింపు ఆమోదయోగ్యం కానిదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఇదొక చవకబారు బెదిరింపు అని విమర్శించింది. ట్రంప్‌ చేసిన హెచ్చరికతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంతమేరకు దెబ్బ తిన్నాయి. తన ప్రభుత్వంపై కుట్ర విఫలమైన నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు ఇటీవల రెఫరెండం నిర్వహించి తన అధికారాలను మరింత విస్తృతపరుచుకున్న సంగతి తెలిసిందే. ఆనాడు ఎర్డోగన్‌ నాయకత్వాన్ని ట్రంప్‌ కూడా ప్రశంసించారు కూడా.