కళాతపస్వి కె.విశ్వనాథ్ పై ‘బయోపిక్’

వాస్తవం సినిమా: దక్షిణాది చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు, ఎన్నో అవార్డులు, సన్మానాలు, బిరుదులు పొందిన కె. విశ్వనాథ్ జీవితం వెండి తెరపై ఆవిష్కృతం కానుంది. ‘విశ్వదర్శనం’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది.వెండితెర చెప్పిన బంగారు దర్శకుని కథ అనేది ఉపశీర్షిక. రైటర్ కం డైరెక్టర్.. పరుచూరి శిష్యుడు జనార్థన మహర్షి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గురుపౌర్ణమి వేళ ఈ సినిమా ముహూర్తం చేశారు. వివేక్ కూచిభొట్లతో కలిసి టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వేడుకలో కె. విశ్వనాథ్‌ దంపతులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి, టి.జి విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల సినిమా స్క్రిప్ట్‌ని జనార్థన మహర్షికి అందించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ దంపతులను చిత్ర బృందం సత్కరించింది. ఆరేళ్ల క్రితం జనార్థన మహర్షి దర్శకత్వంలో రూపొందిన ‘దేవస్థానం’ చిత్రంలో విశ్వనాథ్‌ ముఖ్య పాత్రలో కనిపించారు.