15 కోట్ల విలువైన బంగారు కుండ ను ఎత్తుకెళ్ళిన దుండగులు

వాస్తవం ప్రతినిధి: గుర్తు తెలియని దుండగులు ఆలయం పై ఉన్న బంగారు కుండ (కలశం) ను ఎత్తుకెళ్ళారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఖానియధాన ప్రాంతంలోని చారిత్రక రామ్ జానకీ ఆలయం దగ్గరకు వచ్చిన దుండగులు పైన ఉన్న రూ.15 కోట్ల విలువైన బంగారు కుండను ఎత్తుకెళ్లారని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నగర పంచాయత్ అధ్యక్షుడు శైలేంద్ర సింగ్ నిన్న ఉదయం ఆలయంపై ఉన్న కలశం అదృశ్యమైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు  డాగ్‌స్క్వాడ్ బృందంతో కలిసి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఖానియధాన ప్రాంత రాజకుటుంబం 300 ఏండ్ల క్రితం ఈ రామ్‌జానకీ ఆలయాన్ని నిర్మించింది. శైలేంద్రసింగ్ జుడియో ఆ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. కలశం 55 కిలోల బరువుంటుందని, ఆలయ పూజారులు చెప్పిన ప్రకారం కలశం విలువ రూ.15 కోట్లున్నట్లు తెలుస్తుంది.