విజయ్ దేవరకొండ పాట పై అభ్యంతరాలు

వాస్తవం సినిమా: పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన కథానాయికగా ‘గీత గోవిందం’ సినిమా రూపొందింది. రొమాంటిక్ ఎంటర్టైనర్లో విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం ఒక పాట పాడాడు. రికార్డింగ్ థియేటర్లో విజయ్ దేవరకొండ పాడుతూ వున్నప్పటి వీడియోతో కూడిన లిరికల్ సాంగ్ ను తాజాగా వదిలారు.

“అమెరికా గాళ్ అయినా . . అత్తిలి గాళ్ అయినా .. యూరప్ గాళ్ అయినా .. యానాం గాళ్ అయినా” అంటూ ఈ పాట జోరుగా సాగింది. ‘అమ్మాయంటేనే టఫ్ఫు .. వాళ్ల తిక్కకి మనమే స్టఫ్ఫు .. దానికి నేనే ప్రూఫు ..’ అంటూ అమ్మాయిల ధోరణిని ప్రస్తావిస్తూ పదాల గారడీతో సాగింది. తొలిసారే అయినా విజయ్ దేవరకొండ ఈ సాంగ్ ను తనదైన స్టైల్లో పాడేశాడు. అయితే ఈ తరం అమ్మాయిల ధోరణిని గురించి ఈ పాటలో ప్రస్తావించారు. అంతేకాదు ఇతిహాసాలు .. పురాణాల్లోని విషయాలను కూడా ఈ తరానికి తేలికగా అన్వయించేశారు.

ఈ నేపథ్యంలోనే పాటలోని కొన్ని పదాలు తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయనే విమర్శలు అమ్మాయిల నుండి రావడంతో ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ పాట వీడియోను కనిపించకుండా చేశారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోన్న వేళ .. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే, ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించినట్టుగా చర్చించుకుంటున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.