భారీ వడగళ్ల వాన….అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం!

వాస్తవం ప్రతినిధి: భారీ వడగళ్ల వాన దాటికి ఒక విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చైనాలో టియాన్‌జిన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ320 విమానం టియాన్‌జిన్‌ నుంచి హైనాన్‌కు గురువారం బయలుదేరింది. అయితే విమానం గాల్లో ఉండగానే భారీగా వడగాళ్ల వాన కురవడం తో విమానం ముందు భాగం, అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీనితో వెంటనే అప్రమత్తమైన పైలట్ ఏంతో చాకచక్యంగా వ్యవహరించి,సమీపంలోని సెంట్రల్ చైనా లోని వుహన్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయడం తో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. అయితే ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు.