ప్రత్యేక హోదారాష్ట్రాలకు రాయితీలు లేవని స్పష్టం చేసిన కేంద్రం

వాస్తవం ప్రతినిధి: ప్రత్యేక హోదా ప్రయోజనాలు అందుతున్న రాష్ట్రాలకు నిర్దిష్టమైన రాయితీలేమీ ఇవ్వడంలేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. హోదాపై భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా కేంద్రం సమాధానం అందించింది.  2015 -16 నుంచి ప్రత్యేక హోదా కల్గిన రాష్ట్రాలకు బ్లాక్‌ గ్రాంట్‌లను నిలిపివేసినట్టు వెల్లడించింది. అలానే ఏపీకి రెవెన్యూ లోటు కింద ఐదేళ్లకు గాను రూ.22,112 కోట్లు అందజేసినట్టు వివరించింది. ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రయోజనాలు దక్కుతున్నాయని,వాటి వివరాలను కూడా వెల్లడించింది.