నా పిల్లల తండ్రే పాక్ కాబోయే ప్రధాని!

వాస్తవం ప్రతినిధి: పాక్ లో జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ దాదాపు విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తన మాజీ భర్త ఇమ్రాన్‌ఖాన్‌ పాక్‌కు ప్రధాని కాబోతున్నారంటూ బ్రిటన్‌కు చెందిన జెమీమా ఖాన్‌ హర్షం వ్యక్తం చేశారు.ఎన్నో ఏళ్ల ఆయన నిరీక్షణ నేటికి ఫలించింది. 1997 కి ఇమ్రాన్ మొదటి సారిగా ఎన్నికల్లో పోటీ చేసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. అప్పట్లో ఫలితాల కోసం నేనెంతో ఆత్రుతగా ఎదురు చూశాను. నిరీక్షించినట్లు గానే ఫోన్ రానే వచ్చింది.మొత్తం ఊడ్చేశాం…అని మరో రకంగా అంటూ పగుల బడి నవ్వారు. ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని,త్యాగాలు చేసిన నా బిడ్డల తండ్రి ఈ రోజు ప్రధాని కాబోతున్నారు.  1995 లో ఇమ్రాన్ ఆమెను పెళ్లి చేసుకొని 2005  లో విడాకు లిచ్చుకున్నారు. విడిపోయిన తరువాత ఆమె ఇప్పుడు లండన్ ఉంటున్నారు. అయితే వారిద్దరూ విదిపోయిన్ప్పటికీ వారి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది.