త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్న ప్రియాంక

వాస్తవం సినిమా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. రెండు నెలల నుంచి డేటింగ్ చేస్తున్న హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనాస్ తో పీసీ నిశ్చితార్థం లండన్ లో జరిగింది. వారం క్రితం ప్రియాంక బర్త్ డే సందర్భంగా నిక్ ప్రియాంక వేలికి ఉంగరం తొడిగినట్టు ‘పీపుల్‘ మేగజైన్ తెలిపింది. అయితే, ఈ విషయాన్ని ప్రియాంక అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ టాలీవుడ్ ప్రముఖుల తాజా ట్వీట్లు చూస్తుంటే, పెళ్లెంతదూరమో లేదనేది మాత్రం ఖాయంగా కనబడుతోంది. అమెరికా మీడియాలో సైతం ఈ సెలబ్రిటీ ఎంగేజ్ మెంట్ ని నిర్థారిస్తూ పలు కథనాలు వచ్చాయి. ఇటీవల ప్రియాంక చోప్రా ముంబై ఎయిర్ పోర్టులో కనిపించినపుడు ఆమె వేలికి వజ్రపు ఉంగరం కనిపించింది. కెమెరాలు తనపై ఫోకస్ చేయగానే పీసీ తన ఉంగరాన్ని దాచేందుకు ప్రయత్నించింది.