ఏడవరోజు కొనసాగుతున్న లారీ యజమానుల సమ్మె

వాస్తవం ప్రతినిధి: లారీ యజమాలను సమ్మె ఏడోరోజుకు చేరింది… దీంతో సరుకు రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది… మార్కెట్లకు సరుకు రావడం లేదు. కూరగాయలు రైతుల దగ్గరే పాడైపోతున్నాయి. ఉల్లి ఘాటెక్కుతోంది…. నిల్వలు తగ్గుముఖం పడుతుండడంతో ఆటోమెటిక్‌గా ధరలు పెరుగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా సుమారు 3 లక్షల లారీలు రోడ్డుమీదకు వచ్చి వారం రోజులైంది. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ నుంచి ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం తదితర కూరగాయలు ఏపీకి దిగుమతి అవుతాయి. అయితే వారం రోజులుగా సరుకులు రాకపోవడంతో నిల్వలు తగ్గిపోయి ధరలకు రెక్కలొస్తున్నాయి.
సమ్మెలో భాగంగా ఒకరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను నిలిపివేసిన సంఘాలు… ట్యాంకర్స్ ఓనర్లతో చర్చించి సమ్మె కొనసాగించే ఆలోచన చేస్తున్నారు. అలాగే మరోరెండు రోజులు చూసి నిత్యావసర వస్తువల సరఫరా కూడా నిలిపివేస్తామంటున్నారు.