ఇల్లీ బేబీ అతడ్ని పిచ్చిగా ప్రేమిస్తోందట

వాస్తవం సినిమా: టాలీవుడ్ ద్వారా గ్లామర్ ఇండస్ర్టీకి పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా కు ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో మ్యారేజ్ అయిపోయిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రచారానికి తగ్గట్టుగానే తమ ఫోటోలను అభిమానులతో షేర్ చేయడం మొదలుపెట్టింది ఇల్లీ బేబీ. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా కాసేపు అభిమానులతో ముచ్చటించింది ఇల్లీ. పర్సనల్ లైఫ్ గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా రిప్లై ఇచ్చేసింది. ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లో నటిస్తున్నానని, చాలా హ్యాపీగా వుందని తెలిపింది. మనసున్న వ్యక్తి ఆండ్రూ నీబోన్ పిచ్చిగా ప్రేమిస్తున్నానని, అతడి రంగు, దేశంతో తనకు అవసరం లేదని బయటపెట్టింది. అలాగే లైఫ్‌లో కుటుంబాన్ని దూరం చేసుకోలేనని, తనకు ప్రేమ ముఖ్యమని ఒక్క ముక్కలో తేల్చేసింది. ఈ లెక్కన ఆండ్రూతో ఇల్లీ మ్యారేజ్ జరగడం ఖాయమన్నమాట. ఇకపోతే రవితేజ-శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ ఫిల్మ్‌లో ఇలియానా హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.