ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’.

వాస్తవం సినిమా: నాగచైతన్య హీరోగా రమ్యక్రిష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ మూవీ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొని విడుదలకు సిద్ధమవుతోంది. మరో రెండు రోజుల్లోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సమాయత్తమవుతోంది. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మూవీ రషెస్ చూసి యూవీ క్రియేషన్స్ వారు లేటెస్ట్ గా మూవీ కృష్ణ – గుంటూరు హక్కులు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రా ఏరియాకు దాదాపు 9 నుంచి 10 కోట్లకు ఈ మూవీని విక్రయించగా.. అందులోనే కృష్ణ – గుంటూరు హక్కులను యూవీకి ఇచ్చినట్టు సమాచారం.ఈ మూవీ ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.