భోజనం చేస్తున్న సమయంలో రెస్టారెంట్ లో కూలిన ఫ్లోర్

వాస్తవం ప్రతినిధి: ఫ్యామిలీ తో సరదాగా గడపడానికి రెస్టారెంట్లలోకి వెళుతుంటాం. అలాంటి రెస్టారెంట్ లో భోజనం చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఫ్లోర్ కూలిపోతే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఘటనే చైనా లోని హేబెయ్ ప్రావిన్స్,షి జియాజువాంగ్ లో ఉన్న ఒక రెస్టారెంట్ లో చోటుచేసుకుంది.  డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆరుగురు వ్యక్తులు డిన్నర్ చేస్తుండగా, వాళ్లు డిన్నర్ చేస్తుండగానే సడెన్‌గా వాళ్ల టెబుల్ కింద ఉన్న ఫ్లోర్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద హోల్ పడింది. వాళ్లంతా కింద పడిపోగా.. కొంతమందికి గాయాలయ్యాయి. కిందిభాగంలో పైప్‌లైన్ లీక్ అవడం వల్ల ఫ్లోర్ కూలిపోయి ఉంటుందని రెస్టారెంట్ తెలిపింది. వెంటనే రెస్టారెంట్‌ను క్లోజ్ చేసి దాన్ని రిపేర్ చేయించినట్లు వెల్లడించింది. గాయాలయిన వాళ్లు తిన్న ఆహారానికి డబ్బులు కూడా తీసుకోలేదని తెలిపింది. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.