ఫోన్‌లో త‌నీష్‌కి క్లాస్ పీకిన ఆయ‌న త‌ల్లి

వాస్తవం సినిమా: బిగ్ బాస్ సీజ‌న్ 2.. 45వ ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యులు త‌మ ఫ్యామిలీస్‌తో ఫోన్‌లో మాట్లాడే అవ‌కాశాన్ని బిగ్ బాస్ క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా తనీశ్ తన తల్లితో మాట్లాడగా, ఆమె చెప్పిన మాటలు ఆసక్తికరంగా సాగాయి. హౌస్ లో దీప్తి సునయనకు క్లోజ్ గా ఉండవద్దని, బయట చాలా పుకార్లు వినిపిస్తున్నాయని ఆమె చెప్పారు. పిల్లలు, పెద్దలు అందరూ ఈ షోను చూస్తున్నారని, దీప్తికి దగ్గరగా ఉంటుంటే ఫ్యాన్స్ కు నచ్చడం లేదని, ఓట్లు రాలవని హితవు పలికారు. కోపంగా ఉండవద్దని హెచ్చరిస్తూ, షో వ్యాఖ్యాత నాని చెప్పినట్టు వినాలని సూచించారు. ఓట్లు వచ్చి, విజయం సాధించాలంటే, కోపం తగ్గించుకుని, సరదాగా ఉండాలని, చూస్తున్న ప్రేక్షకులకు నచ్చితే చాలని సలహా ఇచ్చారు తనీష్ తల్లి.