పాకిస్థాన్‌ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ప్రధాని గిలానీ

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2008 నుంచి 2012 వరకు పాక్ ప్రధానిగా పని చేసిన ఆయన ముల్తాన్‌లోని షుజాబాద్‌ నియోజకవర్గంలో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ (పీటీఐ) అభ్యర్థి మొహమ్మద్‌ ఇబ్రహీంపై పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. షుజాబాద్‌లో 2002లో గిలానీ మేనల్లుడు ముర్తాజా గిలానీ గెలుపొందారు. కాగా ఆయన 2015లో హజ్‌ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో యూసుఫ్‌ గిలానీ ఆ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ) చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను పాక్‌ ఓటర్లు తిరస్కరిస్తున్నారు. ఆయన పార్టీలోని అభ్యర్థులు దాదాపుగా వెనుకంజలోనే ఉన్నారు. గతంలో తీవ్రవాదంతో సంబంధం ఉన్న అభ్యర్థులెవరూ ముందంజలో లేకపోవడం గమనార్హం. మరోపక్క పాక్‌ జాతీయ ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 272 స్థానాలకు ఎన్నికలు జరగగా 113 చోట్ల పీటీఐ ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది.