పశ్చిమ బంగ్లా గా మారనున్న పశ్చిమ బెంగాల్

వాస్తవం ప్రతినిధి: ఇక పశ్చిమ బెంగాల్ కాస్త పశ్చిమ బంగ్లా గా మారనుందా అని అంటే అది నిజమే అని అనిపిస్తుంది. ఎందుకుంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ.. పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా మారుస్తూ తీర్మానాన్ని పాస్ చేసినట్లు తెలుస్తుంది. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంపనుంది. ఒక వేళ కేంద్ర హోంశాఖ గనుక దీనికి పచ్చ జెండా ఊపితే పశ్చిమ బెంగాల్ పేరు కాస్తా బంగ్లాగా మారనుంది. ఇక పశ్చిమ బెంగాల్ పేరు మనకు మున్ముందు వినిపించదేమో! అయితే పశ్చిమ బెంగాల్ పేరును మార్చాలని ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. పశ్చిమ బెంగాల్ పేరును మార్చుతామని సీఎం మమతా బెనర్జీ కూడా ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.  పశ్చిమ బెంగాల్ పేరు మార్పు తీర్మానానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ 2016, ఆగస్టులో ఆమోదం తెలిపింది. అప్పుడు కేంద్ర హోంశాఖకు ఆ తీర్మానాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంపినప్పటికీ కూడా పేరు మార్కాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ మరోసారి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ.. పేరుమార్పు తీర్మానాన్ని ఆమోదం తెలపడం తో త్వరలోనే ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు తెలుస్తుంది.