తానింకా బ్రహ్మచారినే అంటున్న చైతూ

వాస్తవం సినిమా :అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ తాజా చిత్రం చి.ల‌.సౌ. అందాల రాక్షసి ఫేం రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా మారి ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. రుహని శర్మ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. అతి త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో చి.ల‌.సౌ చిత్రానికి ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. తాజాగా సుశాంత్ త‌న ట్విట్ట‌ర్‌లో బాయ్స్ అండ్ గార్ల్స్‌ని బ్యాచిల‌ర్ పార్టీకి ఆహ్వానిస్తున్న‌ట్టు తెలిపాడు. గూగుల్ లింక్‌లో పెళ్లిని వాయిదా వేసుకోవడం కోసం మీరు ఏ కారణం చెబుతారో అందులో రాయాల‌న్నాడు. స‌రిగ్గా స‌మాధానం చెప్పిన వారికి చి.ల‌.సౌ సినిమాని రిలీజ్ కంటే ముందే చూపించి అమేజింగ్ పార్టీ ఇస్తామ‌ని అన్నారు. సుశాంత్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన చైతూ ..కేవ‌లం బ్యాచిల‌ర్స్‌నే పార్టీకి పిలుస్తారా..నన్నెందుకు పార్టీకి పిలవరు? నాలో ఉన్న బ్యాచిలర్ ఇంకా బతికే ఉన్నాడని అన్నాడు అక్కినేని నాగచైతన్య. దీనికి స్పందించిన స‌మంత కొంటెగా భ‌ర్త‌ గారు.. మీరు చెప్పింది క‌రెక్టే అని స‌మాధానం ఇచ్చింది. ఈ ముగ్గురు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లు నెటిజ‌న్స్‌కి ఆనందాన్ని పంచాయి.