డ్రగ్ పరీక్షల్లో కూడా వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది: సెరెనా

వాస్తవం ప్రతినిధి: డ్రగ్‌ పరీక్షల్లోనూ వివక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని అమెరికా టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికా డోపింగ్‌ నిరోధక అధికారులు అందరి కన్నా తనకే ఎక్కువ సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఇక్కడ కూడా తానూ వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆమె వాపోయింది. వింబుల్డన్‌ ఆడుతున్న సమయంలో తనను లక్ష్యం చేసుకొని మరీ పరీక్షలు చేశారని ఆమె ట్వీట్‌ చేశారు. ‘అధికారులకు పరీక్ష చేయాలనిపిస్తుందంటే అది సెరెనాకే. అందర్నీ మినహాయిస్తే ఎక్కువ సార్లు పరీక్షలు నిర్వహించింది నాకే. విచక్షణ అంటారా దీన్ని? అవుననే అనిపిస్తోంది. ఏదైతేనేం చివరికి నేనన్నా ఆటలను స్వచ్ఛంగా ఉంచుతున్నాను, #stayPositive’ అని సెరెనా ట్వీట్‌ చేసింది. 

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సెరెనా విలియమ్స్‌ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కఠినమైన శస్త్రచికిత్స చేయించుకుంది. మళ్లీ మైదానంలో అడుగుపెట్టి వింబుల్డన్‌ రన్నరప్‌గా నిలిచింది.