టొరంటో లో కాల్పులకు పాల్పడింది పాక్ జాతీయుడు!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల కెనడాలోని టొరొంటోలో కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఒక దుండగుడు కాల్పులు జరిపి ఇద్దరి మృతికి కారకుడయ్యాడు. అయితే అతడి వివరాలను టొరంటో పోలీసులు వెల్లడించారు. అతడి పేరు ఫైజల్‌ హుస్సేన్‌ (28) అని, పాకిస్థాన్‌ సంతతి వ్యక్తి అని, కిరాణ దుకాణంలో పనిచేసేవాడని వివరించారు. అయితే అతడి మానసిక స్థితి సరిగ్గాలేదని, ఈ నేపధ్యంలో చికిత్స కూడా తీసుకుంటున్నాడని వారు తెలిపారు. ఆదివారం అతడు జరిపిన కాల్పుల్లో పదేళ్ల బాలిక, 18 ఏళ్ల యువతి మరణించగా, 13 మంది గాయపడ్డారు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడు ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు అనే కారణాలు మాత్రం తెలియరాలేదు.