చైనా లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు

వాస్తవం ప్రతినిధి: చైనా రాజధాని బీజింగ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. గురువారం ఉదయం ఎంబసీ సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురైనట్లు తెలుస్తుంది. దీనితో ఈ సమచారమ మందుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలికి చేరుకొని, పరిస్థితి ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పేలుడుకు పాల్పడింది చైనాకు చెందిన 26ఏళ్ల వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 1.00 గంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నర్‌ మంగోలియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అమెరికా రాయబార కార్యాలయం ఎదుట బాంబు దాడికి యత్నించాడు. అయితే అది అతడి చేతిలోనే పేలిపోవడం తో నిందితుడు మినహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చైనా పోలీసులు తెలిపారు. అయితే బాంబు తీవ్రత తక్కువగా ఉండడం తో ఎలాంటి భారీ ప్రమాదం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. అయితే నిందితుడి పూర్తి వివరాలను దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే భారత ఎంబసీ కూడా ఉంది. బాంబు పేలుడుకు సంబంధించిన ఫొటోలను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ ఫోటో లో నేట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు బాంబు పేలుడు జరిగిన కొద్దిసేపటికే ఓ యువతి అమెరికా రాయబార కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోవాలని ప్రయత్నించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడినప్పటికీ వాటిపై మాత్రం చైనా పోలీసులు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.