అంతర్వేది వద్ద పడవ ప్రమాదం!

వాస్తవం ప్రతినిధి: తూర్పు గోదావారి జిల్లా లోని అంత‌ర్వే‌ది వ‌ద్ద పడవ ప్రమాదం జరిగింది. అంతర్వేది వద్ద స‌ముద్రంలో మ‌త్స్య‌కారుల ప‌డ‌వ బోల్తా ప‌డడం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ప‌డ‌వ‌లో ఐదుగురు మ‌త్స్య‌కారులున్న‌ట్లు అధికారుల‌కు స‌మాచారం అందింది. చేప‌ల‌వేట‌కు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని, అల‌ల తీవ్ర‌త ఎక్కు‌వ‌గా ఉండ‌టంతోనే ప‌డ‌వ బోల్తా ప‌డి ఉంటుంద‌ని అధికారులు భావిస్తు‌న్నా‌రు. అయితే ఈ ఘటన లో గ‌ల్లంతైన వారి కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి‌న‌ట్లు అధికారులు తెలిపారు.