సీనియర్ ఐపీఎస్ అధికారిని శిఖాగోయల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

వాస్తవం ప్రతినిధి: సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖాగోయల్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. జూబ్లీహిల్స్‌లో ఆమె ప్రయాణిస్తున్న కారుకు పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టిడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం నుంచి శిఖాగోయల్ సురక్షితంగా బయటపడగా,ఈ ఘటనలో కారు ముందుభాగం ధ్వంసమైనట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి కారణమైన ఆటోడ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.