సిరియా లో ఆత్మాహుతి దాడి….38 మంది మృతి!

వాస్తవం ప్రతినిధి: సిరియా లో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కు చెందిన ఉగ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో 38 మంది మృతిచెందగా,మరో 30 మందికి పైగా పౌరులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించుకోవడం తో ఇది ఆ గ్రూప్ పనే అని అధికారులు వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నడుముకు పేలుడు పదార్థాల బెల్ట్‌తో స్విదాయ్ నగరంలోకి ప్రవేశించి ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.