సిరియా యుద్ద విమానాలను కూల్చేసిన ఇజ్రాయిల్

వాస్తవం ప్రతినిధి: ఇజ్రాయిల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ రెండు సుఖోయ్‌ యుద్ధవిమానాలను కూల్చేసింది. ఇజ్రాయిల్‌కు చెందిన గగనతలంలోకి సిరియా కు చెందిన సుఖోయ్ యుద్ధ విమానాలు అక్రమంగా ప్రవేశించిన కారణంగా ఆ రెండు యుద్ధవిమానాలను కూల్చేసిన ట్లు ఇజ్రాయిల్ రక్షణ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశం పై సిరియా మాత్రం స్పందించలేదు కానీ, గోలన్‌ హైట్స్‌ దక్షిణ ప్రాంతంలో ఈఘటన చోటు చేసుకోందని,పైలట్లకు సంబంధించిన సమాచారం మాత్రం వెల్లడికావాల్సి ఉంది.  సిరియా – ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఇటీవల ఘర్షణ వాతావరణ పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో సిరియా వైపు నుంచి దూసుకువస్తున్న ముప్పును రెండు క్షిపణులను ప్రయోగించి కూల్చివేసినట్లు ఇజ్రాయిల్‌ రేడియో ప్రకటించింది. ఇటీవల కాలంలో సిరియా వైపు నుంచి ఇజ్రాయిల్‌ గగనతలంలోకి డ్రోన్ల సంచారం పెరిగింది. దీంతో ఇజ్రాయిల్‌ వీటిని కూల్చివేయడం మొదలుపెట్టింది.