వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సంచలన ప్రకటన!

వాస్తవం ప్రతినిధి: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో త్వరలోనే ‘వైయస్సార్ అన్న’ పేరుతో క్యాంటీన్లను సొంతంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇప్పటికే నగిరిలో ఆర్ఓ ప్లాంట్ల ద్వారా మంచినీళ్లిస్తున్న తనకు.. ఒక పూట భోజనం పెట్టడం కష్టమేమీ కాదన్నారు. ఇప్పటికే 10 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందించానని… నగరి ప్రభుత్వాసుపత్రి, హాస్టళ్లు, బాలికల జూనియర్ కాలేజీల్లో ఆర్వో ప్లాంట్లు, కూలర్లను ఏర్పాటు చేశానని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరి నియోజకవర్గ రూపురేఖలే మారిపోతాయని, ప్రభుత్వ సహకారం లేకుండానే ఈ పని చేసి చూపెడతానంటునంటూ చెప్పుకొచ్చారు రోజా.