రసాభాస గా మారిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నియోజక వర్గ సమావేశం

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ సమావేశం మహబూబా బాద్ లో జరిగింది. అయితే ఈ సమావేశం రసాభాస గా మారింది. ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి, కాంగ్రెస్ నేత హుస్సేన్ నాయక్ వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడం తో ఆ సమావేశం లో గందరగోళం నెలకొంది. లోపలికి అనుమతించే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వేదికపై నాయకులతో కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా ఈ సమావేశంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సలీం అహ్మద్ కూడా హాజరైనట్లు తెలుస్తుంది