ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ‘సైరా’

వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘సైరా’ చిత్ర పనులు హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా, తాజాగా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ .. బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లోని కీలకమైన సన్నివేశాలను ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరించారు. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ కి సంబంధించిన సన్నాహాల్లో ఈ సినిమా టీమ్ వుంది. మొదట్లో ఈ సినిమాకి ఏఆర్.రెహమాన్ సంగీతం అందించాల్సి ఉండగా ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో సంగీత దర్శకుడెవరనే ఆలోచనలు మొదలయ్యాయి. మధ్యలో పలువురి పేర్లు వినిపించినా చిత్ర యూనిట్ మాత్రం ఎవ్వరినీ కన్ఫర్మ్ చేయలేదు. కానీ తాజా సమాచారం మేరకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి స్వరాలూ సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆగష్టు 22న టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో దానికి సంబందించిన పనులు మొదలుపెట్టారట ఆయన. త్రివేది గతంలో ‘దేవ్ డి, క్వీన్, ఉడ్తా పంజాబ్’ వంటి హిందీ సినిమాలకు సంగీతాన్ని అందించారు.