పాక్ జట్టును ఎదుర్కోనున్న భారత కు చెందిన స్పిన్నర్!

వాస్తవం ప్రతినిధి: భారత్‌కు చెందిన ఓ స్పిన్నర్‌ పాక్‌ క్రికెట్‌ జట్టును ఎదుర్కోబోతున్నాడు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా. అదేమీ లేదండీ భారత సంతతి కి చెందిన స్పిన్నర్ అజాజ్ పటేల్ న్యూజిలాండ్ టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు.  అక్టోబరులో యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం అజాజ్ ఎంపికయ్యాడు. 29 ఏళ్ల పటేల్‌ న్యూజిలాండ్‌లో గత మూడేళ్లుగా దేశీయ మ్యాచ్‌లు ఆడి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. 2017లో ‘డొమెస్టిక్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా కూడా నిలిచాడు. న్యూజిలాండ్‌ ప్రధాన సెలక్టర్‌ గెవిన్‌ లార్సన్‌ జాతీయ జట్టులోకి గాయపడిన మిచెల్‌ శాంట్‌నర్‌ స్థానంలో పటేల్‌ను తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనితో పాక్ తో న్యూజిలాండ్ తరపున పోరాడనున్నాడు. అజాజ్‌ పటేల్‌ ముంబయిలో జన్మించాడు. చిన్నతనంలోనే వారి కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. పటేల్‌ ఇటీవల ఆడిన సీజన్లలో 21.52 సగటుతో 48 వికెట్లు తీసుకున్నాడు.