నిర్మాణం లో ఉన్న హైడ్రో పవర్ డ్యామ్ కుప్ప కూలింది!

వాస్తవం ప్రతినిధి: నిర్మాణంలో ఉన్న హైడ్రో పవర్‌ డ్యామ్‌ కుప్ప కూలింది. ఈ ఘటనలో కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది. ఆగ్నేయ లావోస్ లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుప్పకూలడంతో కనీవినీ ఎరుగని విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆగ్నేయ లావోస్‌లో మంగళవారం జరిగింది. జల విద్యుత్‌ ఉత్పత్తిని పెంచేందుకు లావోస్‌లో దేశవ్యాప్తంగా హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి అటాపీ ప్రావిన్సులో నిర్మిస్తున్నారు. ఈ నేపధ్యంలో డ్యామ్ కుప్పకూలడం తో 6,500 మంది నిర్వాసితులు అయ్యారు. అయితే ఈ ప్రమాదం లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా లెక్కతేలలేదు. వందలాది మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య వేలలో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. డ్యామ్‌ కుప్పకూలిన సమయంలో ఒక్కసారిగా 500 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నీరు కింద ఉన్న జనావాస ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ ఘటనలో మృతులు అంచనాకు మించి ఉండొచ్చని తెలుస్తోంది. కాగా, వందల సంఖ్యలో ఇళ్లు సైతం నీటి ధాటికి కొట్టుకుపోయాయి. దీంతో లావోస్‌ ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను ఆదుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది.