త‍్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న తమన్నా

వాస్తవం సినిమా: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్న తమన్నా బాలీవుడ్ ప్రేక్షకులకి కూడ సుపరిచితమే. అందుకే ఆమె గురించిన వార్త ఏదైనా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. తమన్నా త‍్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సౌత్‌ సినిమా సర్కిల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ నటించిన తమన్నా ఇప్పటికే ఇండస్ట్రీలో అడుగుపెట్టి పుష్కార కాలానికి పైగానే పూర్తయ్యింది. కొంత కాలంగా సరైన అవకాశాలు లేకపోవటంతో పర్సనల్‌ లైఫ్ మీద దృష్టి పెట్టారు తమన్నా. ఇప్పటికే ఆమె కుటుంబం సభ్యులు వరుడ్నికూడా ఫైనల్ చేశారన్న టాక్‌ వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఓ డాక్టర్‌తో త్వరలోనే తమన్నా వివాహం జరుగునుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై తమన్నా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ క్వీన్‌ రీమేక్‌తో పాటు వెంకటేష్‌, వరుణ్ తేజ్‌ ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎఫ్ 2 సినిమాల్లో నటిస్తున్నారు.