గోవిందం దూకుడు మామూలుగా లేదు

వాస్తవం సినిమా: విజ‌య్‌దేవ‌ర‌కొండ నటించిన ‘ గీత గోవిందం ‘నుండి ఆ మధ్య విడుదలైన తొలిపాట సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే 19మిలియన్స్ వ్యూస్ తో గోవిందం దూసుకెళ్తున్నాడు. ఇంకేం కావాలి అంటూ గోపీసుంద‌ర్ ఇచ్చిన ట్యూన్ అదిరిపోయింది. దీంతో గోవిందం దూకుడు ఆగలేదు. ఆ తర్వాత రిలీజ్ చేసిన టీజర్ ను ఏకంగా 4 మిలియన్స్ కు పైగా చూసి ఔరా అనిపించారు. విజయ్ దేవరకొండకు మార్కెట్ వాల్యూతో పాటు… ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో దీంతో అర్థమైంది. యూత్ లో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ తో వచ్చిన రెస్పాన్స్ తో… చిత్ర యూనిట్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ రౌడీ ఫ్రస్టేటెడ్ సింగర్ గా మారాడు. స్వయంగా ఈ సినిమా కోసం పాడిన పాటను రెండో పాటగా రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫ్రస్టేటెడ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

విజ‌య్‌దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మండన్న జంట‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ప‌రుశురాం దర్శకుడు. శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ప్రొడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో ఘా2 ఫీఛ్టూఋఏశ్ బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 29న ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయనున్నారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.