కాలు బెణకడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: పశ్చిమగోదావరి జిల్లాలో పోరాట యాత్రలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కుడి కాలు బెణకింది. భీమవరంలోని ఎన్డీ ఫంక్షన్ హాల్ లో బస చేసిన పవన్ ని కలిసేందుకు పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడేందుకు పవన్ వెళ్తున్న సమయంలో అక్కడి గచ్చు తడిగా ఉండటంతో ఆయన కాలు జారడం..బెణకడం జరిగిందని ‘జనసేన’ ఓ ప్రకటనలో పేర్కొంది.కాలి నొప్పితోనే జనసేన సైనికులతో పవన్ మాట్లాడారు. అనంతరం డాక్టర్లు వచ్చి పరీక్షించి పెయిన్ కిల్లర్స్ వాడాలంటూ కాలుకు క్యాప్ వేశారు. ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో బుధవారం నాటి పవన్ కార్యక్రమాలు రద్దయ్యాయి.