ఒంటరిగా ఉన్న జంటపై దాడి…యువతి పై అత్యాచార యత్నం చేసిన జవాన్!

వాస్తవం ప్రతినిధి: సికింద్రాబాద్‌ తిరుమలగిరిలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న ఒక జంట పై ఆర్మీ జవాన్ అత్యాచార యత్నం చేసినట్లు తెలుస్తుంది. మంగళవారం ఒంటరిగా ఉన్న ఒక జంట లో యువతి పై జవాన్ అత్యాచారం చేయబోయాడు. అయితే అతడిని అడ్డుకున్న ప్రియుడి పై కూడా జవాన్ బ్రీజేష్ దాడి చేసి గాయపరచినట్లు తెలుస్తుంది. బ్రీజేష్ కుమార్ అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా పోలీసులకు యువతి కాల్‌ చేయడం తో పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు జవాన్ బ్రిజేష్ కుమార్ పారిపోయాడు. అయితే  ప్రస్తుతం జవాన్‌ బ్రిజేష్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నాలుగు నెలల క్రితం పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేశాడని, డిఎన్‌ఎ ఆధారంగా 2 కేసుల్లో బ్రిజేష్‌ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు.