ఆలియా-రణబీర్ మధ్య ఏముందో.. ప్రతి ఒక్కరికి తెలుసు..

వాస్తవం సినిమా: బాలీవుడ్ లో ప్లేబాయ్ గా పేరు సంపాదించిన హీరో రణబీర్ కపూర్ ఎఫైర్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. తొలుత దీపికా పదుకొనే – తర్వాత కత్రినా కైఫ్ తో ఎఫైర్లు నడిపాడు. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు ఆలియాకు దగ్గరయ్యాడన్నది బాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. ఆలియా-రణబీర్ బంధానికి రెండు కుటుంబాలు కూడా ఓకే చెప్పేశాయట. తాజాగా వీరి బంధంపై రణబీర్ తండ్రి రిషికపూర్ స్పందించాడు. ఓ ప్రముఖ ఆంగ్ల ప్రతికతో ఆయన మాట్లాడారు. తన కొడుకు రణబీర్ పెళ్లి పీటలు ఎక్కాలన్నది తన కోరిక అని.. ఎవరిని చేసుకున్నా తనకు మనవలు మనమరాళ్లతో కలిసి ఆడుకోవాలన్నదే కోరిక అని తెలిపాడు. ఆలియా-రణబీర్ మధ్య ఏముందో.. ప్రతి ఒక్కరికి తెలుసు.. తానింకేమీ చెప్పాల్సిన అవసరం లేదు అని రిషికపూర్ స్పష్టం చేశారు. ఇలా ప్రేమలు – బ్రేకప్ లతో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను మార్చిన రణబీర్.. తాజాగా ఆలియా భట్ తోనైనా ప్రేమను పెళ్లి పీటల వరకూ తీసుకెళ్తాడా లేదా అన్నది ఫిలిం నగర్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.