శ్రీలంక ఓపెనర్ ధనుష్క గుణ తిలక పై వేటు!

వాస్తవం ప్రతినిధి:  శ్రీలంక ఓపెనర్‌ ధనుష్క గుణతిలకపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు సస్పెన్షన్‌ వేటు వేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్‌ సందర్భంగా గుణతిలక బస చేసిన హోటల్‌ గదిలో అతడి స్నేహితుడొకరు ఓ నార్వే మహిళపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు రావడం తో ఆ దేశ క్రికెట్ బోర్డు అతనిపై వేటు వేసింది. ఆదివారం గుణతిలక స్నేహితుడు ఇద్దరు నార్వే మహిళల్ని గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అందులో ఒక మహిళ తనపై అతను అత్యాచారం జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో గుణతిలక స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలంక బోర్డు ప్రాథమిక విచారణ అనంతరం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడన్న కారణంతో గుణతికలపై వేటు  వేసినట్లు ఆ బోర్డు తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో గుణతిలక చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. అయితే ఈ అత్యాచార కేసుకు సంబంధించిన విచారణ ఆధారంగా గుణతిలకను మళ్లీ జట్టులోకి తీసుకోవాలా వద్దా అన్న దానిపై త్వరలో బోర్డు నిర్ణయం తీసుకోనుంది.