వడ దెబ్బకు 40 మంది మృతి!

వాస్తవం ప్రతినిధి: జపాన్ లో వడ దెబ్బ కారణంగా 40 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. గత వారం రోజులుగా అక్కడ విపరీతంగా నమోదైన ఉష్ణోగ్రతల నేపధ్యంలో వడ దెబ్బకు 40 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. జపాన్ రాజధాని టోక్యోకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైతమా ప్రిఫెక్చర్‌లోని కుమగయాలో అత్యధికంగా 41.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయింది. పెరిగిన ఉష్ణోగ్రతలతో జపాన్‌ నిప్పుల కొలిమిలా మారింది. దీనితో ఒక్క శనివారం రోజునే దాదాపు 11 మంది మృతి చెందినట్లు స్థానిక పత్రికలు వెల్లడించాయి.