రెండు ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పినా ఆదాయం మాత్రం తగ్గడం లేదు!

వాస్తవం ప్రతినిధి: మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదాయం మాత్రం తగ్గడం లేదట. రెండు ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేసినా, క్రికెట్‌ కెరీర్‌ చరమాంకంలో ఉన్నా.. అతని ఆదాయం మాత్రం తగ్గట్లేదు. ఇది ఎలా చెప్పగలుగుతున్నారు అని అనుకుంటున్నారా. 2017-18 వార్షిక సంవత్సరానికి ఝార్కండ్‌లో అత్యధిక పన్ను చెల్లించి వ్యక్తిగా ధోనీనే నిలవడం తో ఈ విషయం అర్ధం అవుతుంది. ఈ ఏడాది కాలానికి అతను రూ.12.17 కోట్ల పన్ను కట్టినట్లు ఝార్కండ్‌ ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించాడు. గత ఏడాది కంటే ధోని రూ.1.24 కోట్లు అధికంగా పన్ను చెల్లించడం విశేషం.