రువాండాలో పర్యటించిన తొలి ప్రధాని మోదీ

వాస్తవం ప్రతినిధి: ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా రువాండా చేరుకున్న ప్రధాని మోదీ, ఆ దేశాధ్యక్షుడు పాల్ కగామేతో భేటీ అయ్యారు.  ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా రువాండాలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో రూ.6 8,960 కోట్లు, వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో మరో రూ. 68,960 కోట్ల పెట్టుబడులకు భారత్‌ ముందుకొచ్చింది. అలాగే, వాణిజ్య, రక్షణ సంబంధ ఒప్పందాలపైనా ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ ఆ దేశంలోని రువేరు ఆదర్శ గ్రామాన్ని సందర్శించి 200 గోవులను బహుమతిగా ఇవ్వనున్నారు.
తూర్పు ఆఫ్రికా దేశమైన రువాండా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా అభివృద్థి చెందుతోంది. మోడీ ఫస్ట్ టైం రువాండా లో పర్యటిస్తున్నట్లు విదేశాంగ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఏ భారత ప్రధాని కూడా రువాండాలో పర్యటించలేదు. మన దేశ రాజధాని ఢిల్లీ కన్నా తక్కువ జనాభా ఉండే రువాండాలో పర్యటిస్తున్నమొదటి భారత ప్రధానిగా మోడీ నిలిచారు. 25 నుంచి 27 వరకు జరగనున్న బ్రిక్స్ దేశాల సమ్మిట్ లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఆసియా దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రువాండాలో పర్యటించారు.