రాష్ట్ర బంద్ లో విషాదం…వైసీపీ కార్యకర్త మృతి!

వాస్తవం ప్రతినిధి: ఏపీ కి ప్రత్యెక హోదా కోసం వైసీపీ పార్టీ శాంతియుతంగా రాష్ట్ర బంద్ ని నిర్వహిస్తోన్నసంగతి తెలిసిందే. అయితే ఆ బంద్ లో విషాదం చోటుచేసుకుంది. హోదా కావాలని నిరసిస్తూ బుట్టాయిగూడెం బంద్‌లో పాల్గొన్న వెసిపి కార్యకర్త కాకి దుర్గారావ మృతి చెందినట్లు తెలుస్తుంది. మఅతి చెందారు. మాజీ ఎమ్మెల్యే, వైసిపి ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి బంద్‌లో పాల్గన్న పార్టీ కార్యకర్త దుర్గారావును పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. దీనితో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే మృతిచెందారు. దీనితో దుర్గారావు స్వస్థలమయిన బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కార్యకర్త మరణ వార్త విన్న వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోదా కోసం తలపెట్టిన ఎపి బంద్‌లో పాల్గన్న వైసిపి కార్యకర్త కాకి దుర్గారావు మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. అలానే తడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోదా పోరులో దుర్గారావు అమరుడయ్యారని జగన్‌ పేర్కొన్నారు.